ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను ప్రారంభించిన మంత్రి
పాలేరు నియోజకవర్గం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం) పాలేరు నియోజకవర్గం ఏరా చెల్లమ్మ నీదేనా రా షాప్ ఏం రెడీ చేసావ్ టీ చేశావా ఇవ్వు వాహ్ భలే ఉంది రా చాయ్ అంటూ ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో టీ స్టాల్ ఏర్పాటు చేసిన మహిళను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఆ టీ స్టాల్ ను శనివారం మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘు రాం రెడ్డి తో కలిసి ప్రారంభించారు. మహిళలు స్వశక్తి తో ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తుందని తెలిపారు