మణికొండ కాదు మచ్చర్ కొండ

గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 4 జనవరి 2025
మణికొండ కౌన్సిల్ పరిధిలోని నెక్నుంపూర్, పుప్పాలగూడ, మణికొండ ప్రాంతాలలోని దాదాపు అన్ని కాలనీల లోని ప్రజలు ఎదుర్కుంటున్న తీవ్ర సమస్యలలో ధోమల బెడదలతో పాటు ట్రాఫిక్ సమస్య మరియు ఎగుడు దిగుడు రహదారిలు కాగా ఈ విషయాలపై అధికారులకు పలుమార్లు పిర్యాదు చేయడం జరిగినదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉప కార్యదర్శి బొమ్ము ఉపేంద్రనాద్ రెడ్డి తెలియజేస్తూ మణికొండ ప్రాంతంలో పెరుగుతున్న ధోమల సమస్య, ముఖ్యంగా వాటి ప్రభావం వల్ల చిన్న పిల్లల ఆరోగ్యలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రజలు ముక్త కంఠంతో వాపోతున్నారని, పిల్లలు పెద్దలు దోమల బెడద తీవ్రతతో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా తది తర వ్యాధులు తీవ్రంగా ఎదుర్కుంటున్నారని, సమ సమాజాన్ని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవడం ఉత్తమంగా భావించి అశేష ప్రజల మద్దతుతో ది సిటిజన్స్ కౌన్సిల్ మణికొండ ఆద్వర్యంలో జనవరి 4 శనివారం రోజున నెక్నంపూర్ చింతచెట్టు సర్కిల్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రాజాభి ప్రాయనికి మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం అనంతరం జనవాహినితొ కలసి దోమల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలనే పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పాదయాత్రగా మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ని కలసి ధోమలను నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లు పద్మారావు, నవీన్ కుమార్, ప్రసాద్, గణపతి రాజు, జాఫర్, విజయ భాస్కర్, సుజాత, స్వప్న, రాధిక, రూపా, అనితా, విజయలక్ష్మిల ఆద్వర్యంలో పలు కాలనీల కార్య వర్గ సభ్యులు, ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి ఆరీఫ్ మొహమ్మద్, కార్యవర్గ సభ్యుడు బొడ్డు శ్రీధర్, స్థానిక నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, గుట్టమీద నరేందర్, రాజేంద్ర ప్రసాద్, మాల్యాద్రి నాయుడు, బుద్దోల్ బాబు, కిరణ్, షేక్ ఆరిఫ్, విఠల్, భాను, రేఖ, మంజు తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking