అవోపా అధ్యక్షునిగా బొడ్డు శ్రీధర్

గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 4 జనవరి 2025
తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య ఆఫీసర్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ ఆద్వర్యంలో జరిగిన కార్య వర్గ సమావేశంలో అవోపా ద్వారా జరుపుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతానికి చెందిన ప్రజల బాగు కొరకు పరితపించే నిరాడంబరుడు బొడ్డు శ్రీధర్ ని పరిచయం చేస్తూ రంగారెడ్డి జిల్లా అర్బన్ 2 కు అధ్యక్షునిగా, గజ్జల స్రవంతినీ మహిళా విభాగపు అధ్యక్షురాలిగా మరియు కార్యవర్గ సభ్యులనూ ప్రకటించి ఇతోచితముగా సన్మానం చేయడం జరిగినది, తథ్ ప్రశ్చత్ బొడ్డు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ మరియు ఇతర పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవోపా అభివృద్ధికై, రంగారెడ్డి అర్బన్ 2 లో మెంబర్షిప్ పెంచి యూనిట్ లను పెంచడానికి అందరినీ కలుపుకొని సాయా శక్తుల తన వంతు ప్రయత్నం చేస్తానని తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking