నిరుపేద కుటుంబానికి అన్యాయం ఆదుకునే ఆపద్బాంధవుల కోసం ఎదురుచూపు ప్రజాబలం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన తూప్రాన్ రెవెన్యూ అధికారులు.
తూప్రాన్, జూన్ 8 (ప్రజా బలంన్యూస్):మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కు బ్రతుకుతెరువు నిమిత్తం సిద్దిపేట జిల్లా నుండి వలస జీవిగా వచ్చి గతపది సంవత్సరాల నుండి
కాయా కష్టం చేసుకొని జీవిస్తున్న వ్యక్తి గురువప్ప గారి సుధాకర్ భార్య మమత వీరికి సంతానం ఇద్దరు ఉన్నారు. భార్య భర్తలు ఇరువురు కష్టపడుతూ కొద్ది గొప్పా సంపాదించుకొని ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని జీవిస్తామనీ ఎంతో ఆశతో 120 గజాల స్థలాన్ని ఆర్డిఓ కార్యాలయ సమీపంలో ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది.
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు వారిపై ఇతరుల చేత దాడి చేయిస్తూ ఈ స్థలం మాదని దౌర్జన్యంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు.
గతంలో ఇట్టి విషయంపై పిఎస్ లో సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇట్టి భూమిని ఎనిమిది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ 1583.
ఇల్లు కట్టుకునే కోణంలో మున్సిపల్ నుండి పర్మిషన్ తీసుకొని, పనులను కొనసాగించి ఇల్లు నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నారు.
కానీ కొంతమందినీ వారి ఇంటి మీదికి తోలుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాదితుల పక్షణ వివిధ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్డీవో శ్యాంప్రకాష్, తాసిల్దార్ జ్ఞాన జ్యోతి లు వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. వారు వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తెలిపారు. తూప్రాన్ ఎమ్మార్వో ఆదేశాల మేరకు , రెవెన్యూ అధికారులు ఆర్ ఐ. నాగరాజు వీఆర్ఏ. ఆంజనేయులు వెంటనే స్పందించి సదర్ వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేశారు. మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామస్తులు తదితరులు ఉన్నారు.