పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

 

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:జులై 31తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు సభకేరారు.. కేటీఆర్‌ మాత్రం ప్రభుత్వా నికి సహకరిస్తామంటే ఎలా నమ్మాలి? అంటూ ప్రశ్నించారు.

ఆ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు..వారి మాటలు వింటే కేటీఆర్‌ జూబ్లీబస్టాండ్‌ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్‌ వ్యాఖ్యా నించారు.

దీంతో అసెంబ్లీలో గందర గోళ పరిస్థితి ఏర్పడిరది. రేవంత్‌ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఒక తమ్ముడుగా రేవంత్‌ రెడ్డిని ఆశీర్వదించాను. కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుం ది.. సీఎం స్థాయికి వెళ్తావ్‌ అని నేను ఆశీర్వదించాను. కానీ, ఆయన నన్ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు అవమాని స్తున్నావ్‌.. నేను ఏం తప్పు చేశా? నేను ఏం మోసం చేశా అంటూ రేవంత్‌ రెడ్డిని సబిత ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఇంటి మీద వాలిన కాకి.. నాఇంటిపై వాలడానికి వీలులేదని చెప్పారు.. ఈ రోజు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ను ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ రేవంత్‌ రెడ్డిని సభితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్య లకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుం ది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. నువ్వు కాంగ్రెస్‌ లోకి వస్తే ముఖ్య మంత్రివి అవుతావని సబితక్క నాకు చెప్పింది.నిజమే

కాని మల్కాజ్‌ గిరి పార్ల మెంట్‌ నుండి పోటీ చేయ మని నాకు సబితక్క చెప్పి తాను బిఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్ళింది.

నన్ను మోసం చేసిన సబిత క్కతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌ కు చెప్పాను. నేను చెప్పే మాట నిజమా కాదా? సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. గవర్నర్‌ ను రిసివ్‌ చేసుకొని తిరిగి వచ్చి అందరికీ సమాధానం చెప్తానని రేవంత్‌ రెడ్డి అన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking