రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 31 జులై 2024:
సమాజ సేవలో తమ వంతు భాగంగా ది సిటిజన్స్ కౌన్సిల్ సంస్థ ప్రధాన ఆశయాల్లో ఒకటైన అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య మరియు ప్రాథమిక విద్యా సదుపాయాలు దేశంలో ప్రతి పౌరుడికి దక్కాలని ఆ విషయమై ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ పరుస్తూ పలు మార్లు X ట్విట్టర్ వేదికగా లేవనెత్తడం జరిగినదని, కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య సదుపాయాల గురించి ప్రస్తావిస్తూ, గడిచిన 76 సంవత్సరాలలో దేశంలో వైద్య ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో లేని విషయం తెలియ పరుస్తూ, ఇటువంటి పరిస్థితులలో ప్రజానీకం తమ ఆరోగ్య సంరక్షణ కోసం స్వంత ఖర్చులతో కూడిన పాలసీ చేసుకునే సందర్భంలో ఆ పాలసీకి 18 శాతం జిఎస్టి కట్టవలసిన దుస్థితి ఏర్పడిందనీ, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడికి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశ జాతీయ ఉత్పత్తికి తోడ్పడగలరని కావున అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యం వైద్య సదుపాయాలు ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం అందించలేదని కావున ప్రజా సౌకర్యార్థం జిఎస్టిని పూర్తిగా ఉప సంహరించుకుంటే కొన్ని లక్షల మంది దిగువ మధ్య తరగతి ఆదాయం గల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని, బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించు కోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరడం ఎంతో ఆహ్వానించ దగ్గ విషయమని ఆరోగ్య భీమా పాలసీలపై జిఎస్టి ఉపసంహరణ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపే జరిగితే హర్షించదగ్గ విషయం అని ది సిటిజన్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు తెలియ పరచ్చినారు.