ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.
మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగంణం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.రెండవ విడత రైతు రుణమాఫీలో భాగంగా రుణమాఫీ చెక్కులను ఆమె రైతులకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా లక్షా యాభై వేల రూపాయల వరకు రుణాలు పొందిన రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రెండో విడతలో రుణమాఫీకి సంబందించి 19058 మంది రైతులకు 200.17 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 30 వేల 105 మంది రైతులకు 171.6 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగింని తెలిపారు. మొత్తం రెండు విడతల్లో కలిపి 49 వేల 163 మంది రైతులు 371.93 కోట్ల రూపాయలను జమచేశామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ డబ్బులు పొందని రైతులు సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారులకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డులలో పొరపాట్ల కారణంగా రైతు రుణమాఫీలో పేరు రాని, ఖాతాలు డబ్బులు జమ కాని రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్ లోని ఫిర్యాధుల విభాగంలో కూడా తమ ఫిర్యాధులను తెలియజేయవచ్చు అన్నారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే రైతు రుణమాఫీ సహాయ కేంద్రము మొబైల్ నంబరు 7288894050 కు సంప్రదించడం ద్వారా తమ సందేహాలను, ఇతర వివరాలను తెలుసుకోవచ్చునని తెలిపారు.రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు రైతులకు మరింత సహకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాం గోపాల్,మండల వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు,రైతులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.