పదవ తరగతి పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

 

ప్రజాబలం వరంగల్ మార్చి18:

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు.
సోమవారం వరంగల్ నగరంలోని
శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్
వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని, డిఇఓ, చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ప్రహారి గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ వెంట డీఈ ఓ వాసంతి,
చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking