ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి18:
పార్లమెంట్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో బాధ్యతతో పని చేయాలని 15 -వరంగల్ ఎస్సి పార్లమెంట్
రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు .
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, జిల్లా ఎన్నికల అధికారులు/కలెక్టర్లు సిక్తా పట్నాయక్, షేక్ రిజ్వాన్ బాషా, భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కుమార్, డిసిపి లతో కలసి
వరంగల్-15 ఎస్సి పార్లమెంట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట్, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఏఆర్ ఓలు,ఉప ఎన్నికల జిల్లా అధికారులు, జిల్లాల ఎన్నికల నోడల్ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయా అసంబ్లీ సెగ్మెంట్లలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ* వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల నిర్వహణకు పరిష్ఠ ఏర్పాట్లు చేయాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గం లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో నవీకరించిన బిఎల్ ఓ
వివరాలు, ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల వివరాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జిల్లా తల నిర్వహణ ప్రణాళిక, క్లిష్టమైన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలైన ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, వి వి టి, అకౌంట్ టీమ్స్, సెక్టార్ ఆఫీసర్ల నియామకం, ఎంసీఎంసి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల సిబ్బందికి శిక్షణ, 4 జిల్లాల ధరల పట్టికలో రేట్లు ఒకే రకంగా ఉండాలని, నోడల్ అధికారుల నియామకం, పోస్టల్ బ్యాలెట్ ల నిర్వహణ, ఓటింగ్ శాతం పెంచుటకు కార్యక్రమాలలో భాగంగా క్యాంపస్ అంబాసిడర్లు, స్పెషల్ పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్లు, ఓటర్స్ అవేర్నెస్ ఫోరంల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, ఎన్నికల విధులు నిర్వహణ, సామగ్రి పంపిణీ కు వాహనాల సమకూర్చన, సెక్టార్ రూట్ మ్యాప్ ల సంసిద్ధత తదితర అంశాలపై ఈ సందర్భంగా కూలంకషంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 1899 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 419 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగిందని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రోజువారీ నివేదికలను ఏలాంటి తప్పులు దొర్లకుండా సకాలంలో పంపాలని సూచించారు. అనంతరం
నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుటకు సమష్టిగా కృషి చేయాలి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వచ్చే 90 రోజులు అధికారులందరూ ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారని, అధికారులతో ప్రతిభ ఉందని, ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా, నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ
గత అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయంతో పని చేయడం వల్ల విజయవంతంగా పూర్తి చేశామని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏఆర్ ఓలు ఏసీపీలో సమన్వయంతో నివేదికలు అందించాలన్నారు. కౌంటింగ్ సెంటర్లు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేస్తూ,ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు.
నేటి నుండే ఎఫ్ ఎస్ టి ఎస్ ఎస్ టి బృందాలు , చెక్ పోస్ట్ లు పనిచేయాలన్నారు.
భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా మాట్లాడుతూ ఈసిఐ నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే పూర్తవుతుందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధిక భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనగామ జిల్లా
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ
ఎన్నికల నిర్వహణను బాధ్యతతో సమర్ధవంతంగా చేపట్టాలని జిల్లా
రోజువారీ నివేదికలు తప్పనిసరిగా అందిచాలన్నారు. .పోస్టల్ బ్యాలెట్ కై అధికారులకు విధులు కేటాయించామని, విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించుకోవలసి ఉందన్నారు.క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.
భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ఎన్నికల వేళ ఓటర్లను ప్రోలోభాలకు గురి చేసేందుకు డబ్బు మద్యం ఇతర సామాగ్రి పంచకుండా అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు చేపట్టిన ఎన్నికల నిర్వహణ ప్రణాళిక గురించి ఆయా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు క్లుప్తంగా వివరించారు.ఈ సమావేశంలోఏ ఆర్ ఓ లు డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, కే శ్రీనివాస్, డి ఎస్ వెంకన్న, రోహిత్ సింగ్, నారాయణ, వెంకటయ్య, మంగీలాల్, సీదం దత్తు, రాధిక గుప్తా, వై వి గణేష్, ఉప ఎన్నికల అధికారులు పీయూష్ కుమార్, సంధ్యారాణి, రాధిక గుప్తా, కే వెంకటేశ్వర్లు, జిల్లా ఎన్నికల పోలీస్ నోడల్ అధికారులు,
డిసిపిలు ఎం ఏ బారి, రవీందర్, సీతారాం, ఏసీపీ లు, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, తాసిల్దారులు, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.