*ముంప్పు ప్రాంతాలను పరిశీలించిన తూర్పు ఎమ్మెల్యే, వరంగల్ మేయర్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జులై 25:
గత మూడు మూడు రోజులుగా దంచి కొడుతున్న వర్షాలతో వరంగల్ తూర్పు అతలాకుతలం అయింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లు ముంపు వాకిట నిలిచాయి. లోతట్టు డివిజన్లో నివసిస్తున్న ప్రజలను వివిధ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి తో కలిసి
ముంపు ప్రాంతాలలో పర్యటించారు. 4 అడుగుల లోతు నీటిలో తేలియడుతున్న 28వ డివిజన్ ట్యాంక్ బండ్ పక్కన ఆనుకొని ఉన్న ఎన్టీఆర్ నగర్ కాలనీలో, బృందావన కాలనీ వరద ప్రాంతాలను ఎమ్మెల్యే నరేందర్ ట్రాక్టర్ పై వెళ్లి అధికారులను సమన్వయ పరుచుకుంటూ వరద ప్రాంతాలను పరిశీలించి ప్రజల బాగోగులు కనుక్కున్నారు. తూర్పు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు కాశికుంటా,ఎస్ఆర్ఆర్ తోట,సాకరాశి కుంట,డీకే నగర్,సాయి నగర్,ఎన్టీయార్ నగర్ కాలనీ పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండలని తెలిపిన వారు
వరద నీరు నిలిచిన చోట ప్రజలను అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నరు. వరద ప్రాంతాలను పరిశీలించిన వారిలో
కలెక్టర్ ప్రావీణ్య,సిపి రంగనాధ్,డీసీపీ భారీ, కమిషనర్ రిజ్వాన్ బాషా,ఏసీపీ బోనాల కిషన్,సిఐలు,స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.