ట్రాక్టర్ పై లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన: సిపి ఏవి రంగనాథ్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జూలై25:
వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రాంత ప్రజలను పోలీసులు రెస్క్యూ బృందల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ ,బృందావన్ లలో పూర్తిగా వరద నీరు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్ లో ప్రయాణించి ప్రస్తుతలను అంచనా వేస్తూ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వరద అధికంగా ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మట్టేవాడ సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం బోట్ల సహాయంతో లైఫ్ జాకెట్లు వేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పోలీస్ కమిషనర్ తో పాటు డిసిపి భారీ, వరంగల్ ఏసీబీ బోనాల కిషన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు