సూపర్ ఫైవ్ హామీతో వస్తున్నాం….!

అధికారం పక్కాగా కాంగ్రెస్ దే…

జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు

రఘునాథపాలెం మండలంలో గడప గడపకు కాంగ్రెస్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం రూ.500 కే వంటగ్యాస్… నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు.. ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు…రైతులకు రూ.2లక్షల రుణమాఫీ… అర్హులైన ప్రతిఒక్కరికీ రూ. 4వేల పెన్షన్ ఇలా ఐదు డిక్లరేషన్ అమలు హామీ తో తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తలపడబోతున్న తమదే అధికారమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఖమ్మం మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం రఘునాథపాలెం మండలంలోని కె.వి. బంజార, మూలగూడెం, మంగ్యా తండా గ్రామాల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారంలోకి రావడమే తరువాయి పై డిక్లరేషన్లతో పాటు ఇంకా అనేక రకాలైన సంక్షేమ పథకాలను తమ పార్టీ అమల్లోకి తీసుకువస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking