ఘనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 118 వార్షికోత్సవ వేడుకలు

బెస్ట్ కస్టమర్ గా నిలిచి ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం
విశాఖపట్నం సెప్టెంబర్ 8 ();దేశంలో ఖాతాదారులు అభివృద్ధి పట్ల సహకారంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా 118 వార్షికోత్సవ వేడుకలు విశాఖపట్నం పూర్ణ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ రామ్ మెహన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రాల్లో ఉన్న స్వర్ణకార కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్రలోను ద్వారా అండగా నిలిచిన సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనీ వేణుమాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం దేశంలో ఉన్న స్వర్ణకారులందరికి అందే విధంగా ప్రతి రాష్ట్రంలో స్వర్ణకార చైతన్య సదస్సులు పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇస్తున్నటువంటి సేవలను అన్ని రాష్ట్రాల్లో స్వర్ణకారులకు అందించే దిశగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు స్టాప్ అందరికీ వేణుమాధవ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉత్తమ కస్టమర్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ గారిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ముదపాక రవి ప్రధాన కార్యదర్శి పెద్దపూడి బ్రహ్మాజీ కోశాధికారి ఈర్ని ప్రకాష్ బ్యాంక్ అప్రైజర్ పెట్ల గోపి బ్యాంక్ కస్టమర్లు స్టాప్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking