ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 13:
మందమర్రి మండల వ్యాప్తంగా వ్యాప్తంగా పిండిని పట్టే రేట్లు పెంచుతున్నామని పిండి గిర్నిల ఓనర్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు నిత్యవసర వస్తువులు రేట్లు పెరుగుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రేట్లు పెంచలేదని, రేట్ల పెంపు విషయంలో మళ్లీ ఐదేళ్ల వరకు రేట్లు పెంచబోమని వారన్నారు. మండల, పట్టణ ప్రజలు మంచి మనసుతో మమ్ములను ఆదరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సెల్వాద్రి శేషగిరిరావు, భోగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.