కర్ణాటకలో నిలబెట్టుకున్నాం… తెలంగాణలోనూ నిలబెట్టుకుంటాం…!

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి లో పార్టీ మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 03(ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రజలకు ఏం కావాలో వాళ్లు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు వారి ఆకాంక్షలకనుగుణంగానే హామీలిస్తాం… వాటిని అధికారంలోకి వచ్చాక చేసి చూపుతాం… కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం తెలంగాణలోనూ అధికారం వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టు కుంటామని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలోని సీతారామఫంక్షన్ హాల్లో జరిగిన మండల పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత మండల పర్యటనకు విచ్చేసిన పొంగులేటికి బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అనేక హామీలిచ్చామని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇళ్లు లేని ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఇప్పుడు కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చామని అధికారమొచ్చాక వాటిని అమలు చేసి చూపుతామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంకో ఆరవై రోజులు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తమతో పాటు తమను నమ్ముకున్న ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని సూచించారు. సోనియమ్మ ప్రకటించిన ఆరుగ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో పొంగులేటితో పాటు పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ లు బచ్చలకూర జ్యోతి, కోండ్రు విజయలక్ష్మి, రామకృష్ణ, మాగి పుల్లయ్య, ఈపూరి సుజాత, ఎంపీటీసీ లు ఉసిరికాయల లక్ష్మయ్య, కట్టెకోల సుధాకర్, మాజీ జెడ్పీటీసీ లు మీసా ముత్తయ్య, కుక్కల హనుమంతరావు, సీనియర్ నాయకులు చాగంటి నారాయణ, ఆరెకట్ల గురవయ్య, దండా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లక్కం ఏడుకొండలు, వార్డు మెంబర్లు బుజ్జిమళ్ల హైమవతి, నిమ్మగడ్డ గౌరీ, పి. నాగిరెడ్డి, వాకా బేబి, చిదుముల మానస, చిలకల సీతారావమ్మ, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, చెర్వు స్వర్ణ, వాకా శ్రీనాథ్, మామిడి వెంకన్న, జాన్ రెడ్డి, రాయపూడి నారాయణ రావు, శ్రీను, ముక్కంటి, కన్నయ్య, రామరావు, మోహన్ రెడ్డి లక్ష్మినారాయణ శ్రీనివాసరావు, సైదులు, వాసు, కన్నా రెడ్డి, ఖాజా తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking