కేటీఆర్ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్ జిల్లాలో బుధవారము ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాప‌న‌, ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. ఈ మేరకు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తుండగా. ఇందులో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాడేగావ్ వ‌ద్ద‌ ప్యాకేజీ 27 ప్రారంభోత్స‌వ ఏర్పాట్ల‌ను, పోచంప‌హాడ్ వ‌ద్ద ఆయిల్ పామ్ ప్యాక్టరీకి శంకుస్థాప‌న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించి, అధికారుల‌కు ప‌లు సూచ‌నలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking