ముస్లిం డిక్లరేషన్ నిర్మల్ జిల్లా కమిటీ.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా ముస్లిం డిక్లరేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల హక్కులకు భంగం కలుగుతోందని దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయిలో ముస్లింల హక్కులను పరిరక్షించేందుకు గత రెండేళ్లుగా రాష్ట్ర స్థాయిలో ముస్లిం డిక్లరేషన్ ఫారం పై సంస్థ కృషి చేస్తోందని ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా స్థాయి సమావేశం అక్టోబరు 15 వ తేదీన జిల్లా కేంద్రం లోని ఐ.ఏ. ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటుచేశామన్నారు. అంతే కాకుండా ముస్లిం డిక్లరేషన్ నిర్మల్ యూనిట్ ఆధ్వర్యంలో పదోతరగతి, జూనియర్ కళాశాల, మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు “వర్తమాన కాలంలో ముస్లింల హక్కులు” అనే అంశం పైన అక్టోబర్ 8 న నిర్వహిస్తున్నారు. ఈ వ్యాసరచన పోటీలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. మహిళలకు ప్రత్యేక పరదా ఏర్పాట్లు ఉంటాయని విలేకరుల సమావేశంలో ముస్లిం డిక్లరేషన్ నిర్మల్ జిల్లా కన్వీనర్ రషీద్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా కో- కన్వీనర్లు షేక్ అహద్ సాహిల్, మహమ్మద్ ఇంతియాజ్, అజారుద్దీన్, మహమ్మద్ బిన్ అలీ, అల్మాస్ ఖాన్, సయ్యద్ అమన్, జుబేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.