మెగా డీఎస్సీ కి 4నెలలు వాయిదా వెయ్యాలి

టీచర్ పోస్టులు 5వేలు కాదు – 24వేలు భర్తీ చేయాలి
వేలాదిమందితో భారీ ధర్నా..దద్దరిల్లిన ఇందిరా పార్క్
హైదరాబాద్ అక్టోబర్ 3 ();హైదరాబాద్ సెప్టెంబర్ మెగా డీఎస్సీకి 4నెలలు వాయిదా వేయాలని, టీచర్ పోస్టులు 5వేలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. వాస్తవంగా 25 వేలకు పైగా ఖాళీగా ఉంటే 5వేలు ఎలా భర్తీ చేస్తారని మొత్తం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ నీల వెంకటేష్ ఆద్వర్యం లో వేలాది నిరుద్యోగులు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, ముఖ్యతిధులుగా కోదండ రామ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మల్లు రవి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి అన్నారు. వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే వరకు నిరుద్యోగుల తరుపున పోరాటం చేస్తానని తెలిపారు. ఈ ధర్నాకు నీల వెంకటేష్, నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని వెల్లడించింది. ప్రకటించిన ఈ పోస్టులను గమనించితే ఈ 5089 పోస్టులలో 33 జిల్లాల వారీగా రోస్టర్ ప్రకారం విభజిస్తే ఒకటి రెండు పోస్టులు కూడా రావడం లేదు. ఆశావాహులు మాత్రం వేల సంఖ్యలో ఉన్నారు. గత ఏడు సంవత్సరాలుగా దాదాపు ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల మంది డిఎడ్/బీఎడ్ అభ్యర్థులు అనగా డీఎస్సీ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం 2022 మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగిస్తూ విద్యాశాఖ పరిధిలో 13086 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. తర్వాత ఆ నోటిఫికేషన్ ఊసే మర్చిపోయారు.. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ రాబోతున్న హడావిడిలో కేవలం 5089 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నాము అని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ ప్రకటన కూడా TET పరీక్ష ముగియగానే డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని వెల్లడించారు. కానీ ఇప్పుడు హడావిడిగా గందరగోళ పరిస్థితులలో దానికి విరుద్ధంగా టెట్ పరీక్ష రాయకముందుగానే డీఎస్సీ పరీక్ష యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులను అయోమయానికి గురి చేయడం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking