ఈనెల రెండో వారంలో హైదరాబాదులో జాతీయ ఓబీసీ మహిళా సదస్సు

హాజరుకావాలని మహరాష్ట్ర ఎంపి సుప్రియ సులేని కోరిన బీసీ సంఘాల నేతలు
హైదరాబాద్ అక్టోబర్ 3 ();దేశవ్యాప్తంగా తీసుకువచ్చిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అలాగే దేశవ్యాప్తంగా బిహార్ రాష్ట్ర తరహలోనే బీసీ కులగణన వెంటనే చేపట్టాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల రెండో వారంలో హైదరాబాదులో పది వేల మంది బిసి మహిళా ప్రతినిదులతో” బిసి మహిళల జంగు సైరన్” పేరుతో జాతీయ ఓబీసీ మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ నేషనల్ నిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరత్ పవర్ శరత్ పవర్ కుమార్తె, పార్లమెంట్ సభ్యురాలు సుప్రియ సులేని స్వయంగా కలిసి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు,నేడు మహారాష్ట్రలోని నాగపూర్ లో సుప్రియ సులెతో జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ ప్రతినిధుల బృందం ఆమెతో సమావేశం అయ్యారు, ఓబీసీ మహిళా సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్బంగ వారు ఆమెను ఆహ్వానించారు.ఓబీసీ మహిళా సదస్సుకు తప్పకుండా వస్తారని సుప్రియ సులే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల అక్టోబర్ రెండో వారంలో జరగనున్నటువంటి మహిళల సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా పార్లమెంటు సభ్యులను, అఖిలపక్ష పార్టీలను, ఓబిసీ మహిళా బిల్లుకు మద్దతు తెలిపినటువంటి జాతీయ నేతలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని అందులో బాగంగానే సుప్రియ సూలే ను అహ్హనించినట్లు ఆయన తెలిపారు.ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా సాధించే దిశగా ఒక రాజకీయ కార్యాచరణ ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి ఈ సదస్సులో ఒక రాజకీయ కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు సుప్రియ సులేను కలిసిన వారిలో రాష్ట్రీయ ఓబీసీ మహసంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ భభన్ రాంవ్ తైవాడే,బిసియువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకల శ్యాం కుర్మ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వా ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్, జాజుల భాస్కర్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking