సీఎం జగన్ తో బడ్జెట్ పెంచి చేతివృత్తులని ఆదుకోండి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్
తాడేపల్లి అక్టోబర్ 3 ( );ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ కౌశల్య యోజన స్కీములో రాష్ట్ర బడ్జెట్ని జత కలిపి రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయ చేతి వృత్తిదారుల అభివృద్ధికి పాటుపడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాంప్రదాయ చేతివృత్తుల వారి కోసం మారిన టెక్నాలజీలో శిక్షణ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం టెక్నాలజీ ద్వారా మార్కెటింగ్ సదుపాయాలతో కూడిన ఈ ప్రత్యేకమైన స్కీము అన్ని వర్గాల వారికి ఉపయోగపడటమే కాక ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే దీనిని ప్రత్యేకంగా గుర్తించి ముందుకు తీసుకువెళతదో ఆ రాష్ట్రంలో సాంప్రదాయ చేతివృత్తుల పని వారి కుటుంబాలు అభివృద్ధిలోకి రావడం తధ్యమని దీనికై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా సంప్రదించి మరిన్ని నిధులు ఏర్పాటు చేయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు చల్ల మధుసూదన్ రెడ్డి గారిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వైయస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి గురవాచారి పాల్గొన్నారు