కెసిఆర్ స్పోర్ట్స్‌ కిట్ల పంపిణి పధకం చారిత్రాత్మకము

గ్రామీణ యువ క్రీడా ప్రతిభ ప్రోత్సాహానికే స్పోర్ట్స్‌ కిట్ల పంపిణి
పండుగ వాతావరణంలో ‘పంపిణీ’ కార్యక్రమం
గ్రామీణ యువ క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు
– సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
హైదరాబాద్ అక్టోబర్ 3 ()తెలంగాణ గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించి, వారి ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ద్వారా చేపడుతున్న ‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ’ పధకం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు కొనసాగే ఈ పంపిణీ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్‌ పర్యాటక యువజన సర్వీసుల క్రీడల శాఖ మంత్రి డా॥ వి. శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటి ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్‌, క్రీడల, యువజనాభివృద్ధి మరియు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్‌, ఐఏఎస్ , స్పోర్ట్స్‌ డైరేక్టర్‌ డా .”కే .లక్ష్మి ఐఏఎస్ , జిల్లా కలెక్టర్‌ రవినాయక్‌లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, నిర్మల్‌ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కేసీఆర్‌ గారి దార్శనికతకు నిదర్శనం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ప్రభుత్వం వందకోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయించి ‘‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌’’ పేరుతో యువతరానికి భారీ కానుక అందజేస్తుందని స్పోర్ట్స్‌ అథారిటి ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ఇప్పటికే రైతు బంధు, రైతు భీమా, కేసీఆర్‌ కిట్స్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌తో పాటు అనేక చారిత్రాత్మకమైన పథకాల కోవలోకి కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ చేరడం హర్షనీయమని ఆయన అన్నారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువత భవిత కోసం 100 కోట్లకు పైగా భారీ నిధులు కేటాయించి, క్రీడా సామాగ్రిని పంపిణీ చేయలేదని, కేసీఆర్‌ గారి ప్రభుత్వం మాత్రమే ‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీతో నూతన చరిత్రకు నాంది పలికిందని ఆయన అన్నారు. 50 వేల రూపాయలకు పైగా విలువ చేసే ఒక్కొక్క కిట్‌లో 23 క్రీడా పరికరాలు, 75 టీషర్ట్‌లను ‘స్పోర్ట్స్‌ కిట్స్‌’ ద్వారా రాష్ట్రంలోని 18 వేల గ్రామాలకు అందజేస్తున్నారని వివరించారు.యువత అభివృద్ధి పథకాల్లో కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలువడం ఖాయమన్నారు. ఇప్పటికే 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, నూతన క్రీడా అకాడమీల ఏర్పాటు అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులకు విలువైన ఇండ్లస్థలాలు, భారీ నగదు ప్రోత్సహకాలు సీఎం కప్‌ నిర్వహణ వంటి క్రీడాభివృద్ధి చర్యలు వినూత్న పథకాల అమలుతో దేశంలో ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుందని ఆయన వివరించారు.నేడు సీఎం కేసీఆర్‌ అమలు చేసిన ‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ స్కీమ్‌’ తెలంగాణ యువతరానికి గొప్ప వరమని రాష్ట్రవ్యాప్తంగా కొలువుదీరిన అన్ని గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో నిరంతరం క్రీడా కార్యక్రమాల నిర్వహణకు, మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడానికి ఈ గొప్ప పథకం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబురంగా కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈరోజు స్పోర్ట్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో ప్రారంభమైనాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున యువజన సంఘాలు, క్రీడా సంఘాలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశంలోనే మొదటిసారి గ్రామీణ యువతకు స్పోర్ట్స్‌ కిట్లను అందజేస్తున్నందుకు వారు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్‌పిలతో పాటు పలు నియోజక వర్గ ఎంఎల్‌ఏలు పాల్గొని, స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ చేశారు. రేపు, ఎల్లుండి కూడా కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో వివిధ శాఖ అధికారుల సహకారంలో, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులు ఈ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking