ప్రజలతో మమేకం కావాలి

 

కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టండి

నేనున్నా భయం వద్దు

కార్యకర్తలకు అండగా ఉంటా

తెలంగాణా ప్రయోజనాల కోసం గొంత్తెత్తి పోరాడుతా

నామ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది పువ్వాడ

నామ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారు పువ్వాడ

మార్పును అందిపుచ్చుకోవాలి తాతా మధు

నామ అజాత శత్రువు

ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాబలం) ఖమ్మం అధికారంలో లేమని అధైర్యపడొద్దు…నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి…మీకు అన్ని విధాలా అండగా ఉంటా..ఎంతటి కష్టాన్ననైనా ఎదుర్కొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యలయంలో శుక్రవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నామ మాట్లాడారు. మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ పంపిస్తే తెలంగాణా ప్రయోజనాలు కోసం జిల్లా వాణిని గొంతెత్తి మరింత బలంగా వినిపిస్తానని అన్నారు .గతం లో మంచి మెజార్టీతో గెలిపించారని, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనని అన్నారు. కార్యకర్తల కష్టం వల్లనే మాకీ పదవులు అన్నారు. ప్రతి ఓటరును ఇంటింటికి వెళ్లి కలిసి కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని వివరించి, ప్రజలతో మమేకం కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతి వాగ్దానం వెనుక మోసం దాగి వుందని ప్రజలు గ్రహించారని, కసితో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి, అబద్ధపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీ గా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రయోజనాలు కోసం, ప్రాజెక్టులు, నిధులు, హక్కులు,రైతులు, బడుగు, బలహీన వర్గాల వారి కోసం మాట్లాడడం జరిగిందని చెప్పారు.అడ్డగోలుగా కృష్ణా నదీ నీటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, నీటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీ లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా నామ , పువ్వాడకు కేక్ తినిపించి, జన్మ దిన శుభాకాంక్షలు తెలిపి, శాలువా తో సన్మానించారు

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నామ గెలుపు చరిత్రాత్మకo అవుతుందని అన్నారు.నామ గెలుపు బీఆర్ఎస్ శిఖ లో మరో కల్కితరాయిగా మిగిలిపో తుందని అన్నారు. ప్రతి సారి నామకు ఖమ్మం నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీనే వస్తుందని, ఈసారి కూడా గతాన్ని మించిన అద్భుతమైన మెజార్టీ వస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ వాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని తెలిపారు. పోరాట పటిమతో పని చేసి, నామను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కష్టపడి పని చేసే వారికి భవిష్యత్ లో తప్పనిసరిగా అవకాశాలుంటాయని చెప్పారు

 


పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసం నేపథ్యంలో ప్రజల్లో వచ్చిన మార్పు ను అందిపుచ్చుకుని విజయం వైపు పయనించాలని అన్నారు ప్రజలతో మమేకమై నామ గెలుపునకు కష్ట పడి పని చేయాలన్నారు. నామ అజాత శత్రువు అని అన్నారు. జిల్లాలో ని జాతీయ రహదారుల వెనుక నామ ఉన్నారని చెప్పారు. రైతుకు బాసటగా నిలిచి, కేంద్రం పై పోరాడి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకొనేలా పోరాడారని తెలిపారు. మనం గెలవాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలని , అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఖమ్మం తో సహా 8 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నట్లు సర్వేలు వెల్లడించాయని మధు చెప్పారు.ఈ సందర్భంగా నామను, పువ్వాడ అజయ్ కుమార్ ను సన్మానించారు ఈ సమావేశంలో మేయర్ నీరజ, కూరాకుల నాగభూషణం,తాళ్లూరి జీవన్, బచ్చు విజయ కుమార్, వీరూ నాయక్, మెంతుల శ్రీశైలం, బొమ్మెర రామ్మూర్తి, దోకుపర్తి సుబ్బారావు, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, మక్బూల్, కర్నాటి కృష్ణ,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , నాయకులు, రఘునాధపాలెం మండల నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్సులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking