ఇన్సూరెన్స్ ద్వారానే ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత

 

బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేసిన మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాధపాలెం లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత భరోసా లభిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన భుక్యా కబీర్ రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 రూపాయల పాలసీ తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన అనారోగ్యంతోమృతి చెందడంతో నామిని అయిన భుక్కా శశికి 10 లక్షల రూపాయల చెక్కును మల్లి బాబు యాదవ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం అట్లా సురేష్ శుక్రవారం ఆ గ్రామంలో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆర్థికంగా ఇన్సూరెన్స్ కాపాడుతుందని వెల్లడించారు. తమ తమ భద్రతతో పాటు కుటుంబ భద్రత కోసం ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ చేయించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఇన్సూరెన్స్ పాలసీ కట్టిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే వడ్డీ బోనస్ తో కలిపి ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ఇన్సూరెన్స్ చేయించు కోవాలని సూచించారు. ప్రజలు రైతులు తమ తమ వాహనాలకు, పంటలకు, పశువులకు, ఇతర జంతువులకు ఇన్సూరెన్స్ చేయించు కుంటారని కానీ తమకు తాము మాత్రం ఇన్సూరెన్స్ చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించు కోవాలని అది భవిష్యత్ తరాలకు బంగారు బాటలో వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ మేనేజర్ కుంచాల చిరంజీవి , ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పిన్ని సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భానోత్ నరసింహ నాయక్, మేకల మల్లికార్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు రాంబాబు, వెంకటకృష్ణ నాగరాజు కోటేశ్వరరావు డివో శివ పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking