జిల్లాలో 5 మంది స్వతంత్ర అభ్యర్థులు ఆరు నామినేషన్లు

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 19:
మేడ్చల్ మల్కాజిగిరి – 7 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా రెండవ రోజు శుక్రవారం జిల్లాలో ( 5)మంది స్వతంత్ర అభ్యర్థులు ఆరు నామినేషన్లు వేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా ఓరుగంటి వెంకటేశ్వర్లు, పెండ్యాల సాయి వరప్రసాద్ , రాజేష్ మిశ్రా శివ్, చలిక చంద్ర శేఖర్, ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, కుడుపూడి వి వి ఎస్ నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking