ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖఛ్చితంగా నమోదు చేయాలి

 

జిల్లా వ్యయ పరిశీలకులు మనోజ్ అలోయిస్ లక్రా, ధృవ్ భోళా

ప్రజాబలం ప్రతినిధి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 19: పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ లు వేసిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖఛ్చితంగా నమోదు చేయాలనీ జిల్లా వ్యయ పరిశీలకులైన మనోజ్ అలోయిస్ లక్రా, ధృవ్ భోళా లు అన్నారు.
శుక్రవారం వ్యయ పరిశీలకులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, షాడో టీమ్ లతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరములో టీం సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని టీంలు సమన్వయంతోఎన్నికల విధులు నిర్వహించాలని, అనుమానాస్పద ఖాతాలను చెక్ చేయాలనీ ఇన్ కమ్ టాక్స్ , బ్యాంకు అధికారులను ఆదేశించారు. పరిశీలకులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, షాడో టీమ్, అకౌంటింగ్ టీం సభ్యులు సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. ర్యాలీ లు, సమావేశాలు నిర్వహించిన పార్టీ ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలన్నారు. కరపత్రాలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించినట్లు, ప్రింటర్ మరియు ప్రచురణ కర్తలు ఎన్నికల ప్రాతినిధ్యం చట్టం 127 ఏ ప్రకారం నిబంధలను పాటించాలని అన్నారు. ఎం సి ఎం సి ద్వారా ఎన్నికలలో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేషన్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయాలన్నారు. ఎం సి ఎం సి కమిటీ ద్వారా రోజువారీ దినపత్రికలలో వచ్చే పెయిడ్ న్యూస్ పై దృష్టి సారించాలని, సోషల్ మీడియా పై పటిష్ట నిఘా ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు, మద్యం పంపిణి పై ఫ్లైయింగ్ స్క్వాడ్స్, ఎస్ ఎస్ టి తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. లావాదేవీల పై పర్యవేక్షణ చేయాలనీ అన్నారు. అన్ని టీం లు జాగ్రత్తగా ఉండి పర్మిషన్స్ సరిగా ఉందా లేదా అని చెక్ చేయాలన్నారు. ఎన్ ఓ సి గ్రీవెన్స్ టీం ద్వారా సీజ్ చేసిన డబ్బు, మద్యం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. సువిధ పోర్టల్ లో నమోదు పై రాజకీయ పార్టీల వారికీ అవగాహన కల్పించమని, ఎం సి సి నియమ నిబంధనలు పాటించేల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో చెక్ పోస్టుల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీలు ముమ్మరం చేయడం తో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే మద్యం, నగదు పై దృష్టి పెట్టామని తెలిపారు.
అనంతరం సి విజిల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ సెంటర్, గ్రీవెన్స్ కమిటీ సెంటర్ మరియు ఎం సి ఎం సి మరియు మీడియా సెంటర్ లను వ్యయ పరిశీలకులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎం సి సి నోడల్ అధికారి కృష్ణ రెడ్డి, ఎక్స్ పెండిచార్ మానిటరింగ్ నోడల్ అధికారి రాజేందర్ రెడ్డి, నోడల్ అధికారులు, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking