(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్, 19 ఏప్రిల్)
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి. కాలనీలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని, కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్.ఐ.జి ఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది అని, భవిష్యత్తులో ఇందిరమ్మ కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. తనను నాన్ లోకల్ అంటున్నారని అసలు సిసలైన లోకల్ అభ్యర్థిని తానేనని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.