టీ టైమ్‌ షాప్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్‌కూమార్‌

ప్రజాబలం కూకట్పల్లి

ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలోని JNTU నుండి హైటెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (KS బేకర్ ) ఎదురుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటుచేసిన *TEA-TIME పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ MLA శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి TEA-TIME షాపుని ప్రారంభించారు.

*ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ .. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని , యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని , రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లా శంకర్ , కలిగినిడి ప్రసాద్ ,అంజి ,పులగం సుబ్బు, షణ్ముఖ ,సామన రాజు,వెంకటేశ్వరరావు, బాల కోటేశ్వరరావు ,శేఖర్ , అనిల్ , చిన్నం దేవ సహాయం , సుబ్బారావు (సుబ్బు ),తోట మురళి మరియు భూశంకర్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking