*ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
*ప్రతిష్టాత్మక నాలుగు పథకాలు అమలు
*శాభాష్ పల్లి లో ప్రారంభించిన విప్
రాజన్న సిరిసిల్ల జిల్లా, జనవరి-26 (ప్రజాబలం ప్రతినిధి)
అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం శభాష్ పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై లబ్దిదారులకు అందజేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీనీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇల్లు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకా ఆయా గ్రామాల్లో పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోని వారు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో అర్జీలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, వేములవాడ ఎంపీడీవో మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.