చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుని పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

దుండగులను వెంటనే అరెస్టు చేయాలి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 12 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ గుర్తు తెలియని దుండగులు ప్రెస్ క్లబ్ లో ప్రవేశించి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్ రాజ్ పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వాస్తవాలను వెలికితిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులపై దాడులు అగట్లేదు అన్నారు. చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్ రాజ్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కర్రె రాజేశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇక ముందు ఈలాంటి సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి నిరసనగా బుధవారం దాదాపుగా 200 మంది జర్నలిస్ట్ లతో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సతీష్,కృఫకర్, రవీందర్ సతీష్,మహేందర్ శేఖర్,సందీప్,చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking