స్థానిక సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం…!

కూకట్‌పల్లి ‘కాంగ్రెస్’ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మార్చి 20

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధి బాలాజీ నగర్ డివిజన్ లో పలు స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ నాయకులతో కలిసి బుధవారం పాదయాత్ర నిర్వహించారు. బాలాజీ నగర్ డివిజన్ లోని సేవాలాల్ నగర్, రాఘవేంద్ర నగర్ లో నాయకులతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను బండి రమేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 58, 59 ద్వారా పేదలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను అర్హులైన నిరుపేదలందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను, కార్యకర్తలను కోరారు. స్థానిక కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టిపి పైప్ లైన్ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.
మేఘ ఇంజనీరింగ్ సంస్థ చేపట్టిన నిర్మాణాలన్ని నాణ్యత లోపoతో నిర్మిస్తున్నారని, కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలలో ఇప్పటికే ఐదు హామీలను అమలు చేశామని, ఆరవ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లు చెరువులు, కుంటలు, ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ తో పాటు ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. ఈ కబ్జాలన్నిటిపై చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ దృష్టికి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము వేణు, నాగిరెడ్డి, సేరి సతీష్ రెడ్డి, కోప్పిశెట్టి దినేష్ కుమార్, ప్రతాప్ రెడ్డి, కృష్ణ రాజ్ పుత్, ప్రవీణ్, మేకల రమేష్, మహిళ నాయకురాలు పుష్ప రెడ్డి, జ్యోతి, రేష్మ, కృష్ణవేణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking