ఆశ్రమానికి అండగా ఉంటాం.

– వోడితల కుటుంబ సభ్యులు

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 17

మాజీ రాజ్యసభ సభ్యులు
వోడితల రాజేశ్వరరావు సతీమణి శారదాదేవి వర్ధంతి సందర్భంగా సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భోజనంతో పాటుగా పండ్లు, స్వీట్స్,తదితర అన్ని పదార్థాలు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ పరంకుశం కృష్ణ స్వామి దంపతులు, డాక్టర్ బుచ్చిబాబు,సంతోష్,ప్రముఖ వ్యాపారవేత్త శ్రీముక్క బాబాన్న తో పాటు పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు ఆశ్రమ సిబ్బంది పిల్లల
తల్లిదండ్రులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.ఆశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తున్న వోడితల కిషన్ రావు,వోడితల శ్రీనివాస రావు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఆశ్రమ వ్యవస్థాపకులు బుచ్చి రాములు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking