శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతాం

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

హరీష్, కేసీఆర్, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్ నపై ఆరోపణలు చేస్తున్నారు

డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు.

హుజూరాబాద్,మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారు.

బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి.

నెలరోజుల్లో 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే… మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో 300 కోట్ల మద్యం అమ్మారు.

మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదు.

దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారు.

మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగింది.

అందుకే మాపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసిరా

చుక్కక్ మందు ,డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరా

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుంది

అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించా

కేసీఆర్ రాకపోగా… అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా?

ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారు

మా కార్యకర్తలపై దాడులు చేశారు.

తెలంగాణ ప్రజలు కోరింది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి

నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారు.

మేం విసిరిన సవాల్ స్వీకటించకపోవడంతో… కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చింది.

నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే… ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించింది.

ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారు.

నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించి వివరాలు ఎలా బయటపెడతారు?

కోర్టు అనుమతితో ఆధారాలు తీసుకున్నాకే వివరాలు వెల్లడించాల్సింది.

కానీ అవేవీ చేయలేదు.

నేను ప్రశ్నిస్తే… ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాకుండా వేరే అధికారిని సస్పెండ్ చేశారు.

రిటైర్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది.

వారిని ప్రయివేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ మాపై దాడులు చేయిస్తున్నారు.

నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా?

కాంగ్రెస్ ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా?

మేం ఇచ్చిన హామీలలో అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు

మరి మేం 2లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం… మరి కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదు

ప్రవలిక కుటుంబ సభ్యులను రేపు రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే…

బీఆరెస్ నేతలను పంపి ఆకుటుంబాన్ని ప్రగతి భవన్ లో బంధిస్తారట

కేసీఆర్ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు.

నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి…

30లక్షల నిరుద్యోగ యువకులారా … ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా

ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుంది.

ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది..

ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.

నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటన చేసిన డీసీపీపై ఎన్నికల అధికారికి పిర్యాదు చేస్తాం..

నిరుద్యోగ యువకులారా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయండి.

కాంగ్రెస్ లీగల్ విభాగం వారికి సహాయ సహకారాలు అందిస్తుంది

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారు.

ఆరు గ్యారంటీలను శివుడి ముంది పెట్టి భక్తితో పూజిస్తారు.

శివుడిపై నాకూ విశ్వాసం ఉంది.

శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతాం

మొదటిరోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటాం

రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది

Leave A Reply

Your email address will not be published.

Breaking