క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్25:క్రిస్మస్ పండుగ సందర్భంగా హన్మకొండ రంగంపేట లోని ఎవాన్జ్జిలికల్ బాప్టిస్ట్ చర్చ్ లో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్రిస్మస్ నుంచి అన్ని బాధలు పోవాలి అని అన్నారు.ఈ క్రిస్మస్ మీకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని,సంపదను,కుటుంబ ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ క్రైస్థవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు గన్నారపు సంగీత్,మహమ్మద్ సమద్, సయ్యద్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking