మానవత్వం పరిమళించిన వేళ, సి పి ఆర్ తో ప్రాణం పోసిన డా॥ వేణుగోపాలకృష్ణ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

రాత్రి 11.30 నిముషాలకు నిర్మల్ శివాజీ చౌక్లో ద్విచక్ర వాహనం పై నుండి ఒక వ్యక్తి కింద పడి పోయారు.జనం గుమి గూడి చూస్తే, ప్రాణం లేదని నిర్ధారించారు.అటుగా వెళ్తున్న నిర్మల్
ప్రభుత్వ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ అక్కడికివచ్చి, పరిస్థితి.తెలుసుకుని 108 అంబులెన్స్ కి ఫోన చేసి,వెంటనే పడిపోయిన వ్యక్తిని పరీక్షించి,చివరి అశగా కార్డియో పల్మనరీ రెసెసిటేషన్ (సి పి ఆర్) అనగా గుండె, ఊపిరితిత్తులను ప్రేరేీపించి,ఉత్తేజ పరిచారు.అలా ప్రాణ వాయువు అందేలా చేశారు. కాళ్లు, చేతులు,కళ్లు కదల్చడం వలన కొంత ఆశ మొదలైంది.
ఈ లోగా అంబులెన్స్ వచ్చింది.డా. వేణుగోపాలకృష్ణ తనే స్వయంగా ఆంబులెనసు లో తీసుకెళ్లి చికిత్స చేశారు.
ఆ వ్యక్తి పేరు రాకేష్, ఇద్గాన్ కి చెందిన వాడు గా గుర్తించారు. తలకు బలమైన గాయం,మెదడులో రక్తనాళలు చిట్లి, స్పృహ కోల్పోవడం వలన,అతన్ని నిజామాబాద్ లోని ఒక ప్రైవేటు
ఆసుపత్రిలో చేర్పించారు. మెదడుకు శస్త్రచికిత్స చేశారు.ప్రాణం నిలిచింది.డా|| వేణు గోపాలకృష్ణ స్వయంగా నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లి.ఐ సి యు.లో రాజేష్ ని చూసి,కుటుంబ సభ్యులు,మిత్రులను కలిశారు.డా॥ వేణుగోపాలకృష్ణ కాపాడిన ప్రాణం. అంటూ,తల్లి,సోదరి, స్నేహితులు ఎంతో సం ఆర్ద్రత తో ప్రణమిల్లారు..
మానవత్వం,వైద్యం రెండూ కలిపి ప్రాణం నిలబెట్టిన డా. వేణు గోపాలకృష్ణ మానవాళికే గర్వకారణం.అమ్మ సుజాత,సోదరి రమ్య, అన్నయ్య మనోజ్, మిత్రులు వంశి,ప్రదీప్, లల్లు,సాయి,శివ, సంజయ్.డా॥ వేణుగోపాలకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking