ఆరోగ్య సంరక్షణలో ఆశ కార్యకర్తల పాత్ర

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 4
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి
డా. సి. ఉమా గౌరి పి హెచ్ సి మల్కాజిగిరి మరియు పి హెచ్ సి బాలానగర్ లో నిర్వహించిన ఆశా డే సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆశా కార్యకర్తల పాత్రను మరింత బలపరచడం మరియు ప్రాథమిక ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అమలు చేయడం అనే అంశాలపై చర్చించబడింది.
ఈ సందర్భంగా డా. ఉమా గౌరి ఆశా కార్యకర్తల తో సంపాదిస్తూ,
తల్లీ-శిశు ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్రను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని సూచించారు.
నియమిత గర్భవీక్షణ పరీక్షలు, సంస్థాగత ప్రసవాల ప్రోత్సాహం, నూతన జన్మించిన శిశువుల ఆరోగ్య పర్యవేక్షణ చేయడం ఎంత ముఖ్యమో వివరించారు.
పోషకాహారం, ఐరన్ సప్లిమెంటేషన్, అనీమియా నివారణ పై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల నియంత్రణ లో భాగంగా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి, అవసరమైన వారికి తగిన రిఫరల్ సేవలు అందించాలి అని తెలిపారు.
మహిళల మాసిక శుభ్రత, కుటుంబ నియంత్రణ విధానాలు పై అవగాహన కల్పించాలని సూచించారు.
అదనంగా,ఇంటర్మీడియట్ మరియు ఎస్ ఎస్ సి పరీక్షల సమయంలో విధులు సమయానికి నిర్వహించడం మరియు నివేదికలను సమర్పించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. అలాగే, అన్ని పరీక్ష కేంద్రాల్లో
ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సరిపడా నిల్వలో ఉంచి, అవసరమైన విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలి అని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య సేవలందించడంలో ఎన్ఎంల
మరియు ఆశా కార్యకర్తల సేవలను కొనియాడుతూ, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా వారు అంతులేని కృషి కొనసాగించాలి అని
డా. ఉమా గౌరి తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking