విద్యార్థులు వార్షిక పరిస్థితుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి తహసిల్దార్ దిలీప్ కుమార్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 04 : పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులు వార్షిక పరీక్షల్లో శ్రద్ధగా చదువుకొని ప్రథమ శ్రేణిలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలని తాసిల్దార్ దిలీప్ కుమార్ సూచించారు.పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపూలే బాలుర పాఠశాల కళాశాలలో సోమవారం రాత్రి పాఠశాలను సందర్శించి బస చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.సిలబస్ విషయాలను తెలుసుకుని,వార్షిక పరీక్షల కోసం ఏ విధంగా సన్నద్ధమవుతున్నారని తెలుసుకొని వారికి పలు సలహాలు సూచనలు అందజేశారు. విద్యార్థులతో దాదాపు రాత్రి 12 గంటల వరకు ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు సమాధానాలకు జవాబులు చెప్పారు.అంతేకాకుండా తాసిల్దార్ సైతం పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలను అడిగి విద్యార్థుల నుండి రాబట్టారు. పేద కుటుంబాల విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి గురుకులాలు ఏర్పాటు చేసిందని పేద విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రాణించి తల్లిదండ్రులతోపాటు గురువులకు పేరు తీసుకురావాలన్నారు. ముందుగా విద్యార్థుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండడం నాకు తెలుసు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సైతం మంచి పౌష్టికరమైన భోజనాన్ని అందించడంతోపాటు,నాణ్యత కలిగిన విద్యను కూడా అందించడం గమనార్హం అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి బస చేశారు.ఉదయాన్నే వంటశాలలోకి వెళ్లి విద్యార్థులకు అందించే బియ్యంతో పాటు పప్పు, కూరగాయలు పరిశీలించారు ఉదయం 5 గంటలకే నిద్రలేచివిద్యార్థుల వ్యాయామతీరును పరిశీలించి,అల్పాహారం చేసి వెళ్లిపోయారు.ఆయన వెంట ప్రిన్సిపాల్ రోనాల్డ్ కిరణ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking