టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కి కేటీఆర్ ప్రతిసవాళ్లు విసురుతున్నారు..
అన్ని అంశాల పై రేపు అమరవీరుల స్థూపం వద్దకు రా చర్చ చేద్దాం.
మీ హయంలో రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎవరు అన్నావు..
ఇప్పుడు ఆయన పేరు పక్కన నీ పేరు వస్తె చాలు అని తహతహలాడుతున్నావ్.
రైతుల సంక్షేమం మీద మాట్లాడేందుకు మీకు సిగ్గు ఉండాలి.
పదేళ్లలో రైతులు చనిపోతే కనీసం పట్టించుకోలేదు.
నీ సవాళ్లకు సామ రామ్మోహన్ రెడ్డి సరిపోతారు.. సీఎం తో పోల్చుకోకు కేటీఆర్.
గోదావరి,కృష్ణ లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం పోరాటం చేస్తుంటే.. బనకచర్ల ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే..
కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ తో రహస్య మంతనాలు జరుపుతున్నాడు..
కేటీఆర్ తో నారా లోకేష్ మంతనాలు ఒక్కసారి కాదు.. పలు మార్లు కలిశారు..
ఆ రహస్య మంతనాలు ఎవరికి లబ్ది చేయడానికో కేటీఆర్ చెప్పాలి