న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా – మెదక్ న్యాయవాధుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

 

మెదక్ జనవరి 5 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ నియోజక వర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన డా. మైనంపల్లి రోహిత్ ను శుక్రవారం స్థానిక మెదక్ కోర్టు నందు బార్ అసోసియేషన్ తరుపున ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో సీనియర్ న్యాయవాధులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెన్నారెడ్డి, సెక్రేటరీ శ్రీపతిరావ్, అడ్వకేట్ హౌజింగ్ వెల్పేర్ సోసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ కుమార్, శోభన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పోచయ్య, జీవన్ రావ్,
గార్లపాటి సురేష్ ,పవన్
శ్రీకర్ రావ్, బాలయ్య, సుభాష్ గౌడ్ లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా న్యాయవాధులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ న్యాయవాధుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని, న్యాయవాధులకు పెండింగ్ లో ఉన్న హౌజ్ సైట్ ప్లాట్ లను అందజేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి న్యాయవాధుల సమస్యల కృషి కి చర్యలు చేపడ్తానని హామినిచ్చారు. అదే విధంగా జూనియర్ న్యాయవాధులకు వెల్ఫేర్ నుండి రావాల్సిన గౌరవ వేతనం పై కూడా సమీక్షా సమావేశంలో చర్చిండంతో పాటు సీనియర్ న్యాయవాధులకు గౌరవ వేతనం 5 వేల రూపాయలతో పాటు, 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామినిచ్చారు. న్యాయవాధుల సమస్యలపై అందజేసిన మెమోరాండం లకు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అపూర్వకంగా స్పందించడం పట్ల న్యాయవాధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాధులు సంజీవ్ రెడ్డి, దామోదర్, లల్లూ, ప్రశాంత్ లతో పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గోన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking