ప్రజల నుంచి ఆరో తారీకు వరకు దరఖాస్తులు సేకరించాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 5 (ప్రజాబలం) ఖమ్మం అర్హులకు ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు జనవరి 6 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆయన అన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యారంటీ పథకాలతో పాటు ఏ ఇతర అంశంపై ప్రజలు అధికంగా దరఖాస్తు సమర్పిస్తున్నారనే అంశాన్ని కలెక్టర్ అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లలో దరఖాస్తులను నింపడంలో ఏవైన సందేహాలుంటే నివృత్తి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking