ప్రజా పాలన దరఖాస్తులను పకడ్బందీగా అంతర్జాలికరణ చేయాలి :

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 5 :

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారెంటీ ల పథకాల దరకాస్తుల కంప్యూటీకరణ పక్కడ్బందీ గా చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వరంగల్ జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, మీసేవ కేంద్రాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఐదు గ్యారంటీల పథకాలపై జరిగిన
ఆన్లైన్ డేటా ఎంట్రీ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభయ హస్తం ఐదు గ్యారంటీల ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులను ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయుటకు గాను జిల్లాలోని మండలాల ఎంపీడీవో కార్యాలయం, మీసేవ కేంద్రాల డేటా ఎంట్రీ ఆపరేటర్లను మూడు సెక్షన్లుగా విభజించి జిల్లా పరిషత్ , డిఆర్డిఓ కలెక్టర్ కార్యాలయాల్లో శిక్షణా కార్యక్రమం ద్వారా సుదీర్ఘంగా వివరించడం జరిగిందని తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ పథకాలపై సమర్పించిన దరఖాస్తులను
క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి ఆన్లైన్లో నమోదు చేయాలని, డేటా ఎంట్రీ కి సంబంధించి ఆపరేటర్లకు లాగిన్, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుందని
అన్నారు. ఫిజికల్ ఫామ్ కి ఆన్లైన్ డేటా కు తేడా వస్తే తప్పనిసరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ బాధ్యత వహించాలని అన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ నెంబర్స్ నమోదు చేసినప్పుడు సరిచూసుకోవాలని చెప్పారు. తప్పుడు నమోదుకు తావు లేకుండా చూసుకోవాలన్నారు .డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కు ఆన్లైన్ నమోదు విషయంలో పంచాయతీ సెక్రెటరీ, బిల్ కలెక్టర్లు సహకరిస్తారని నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో నమోదు చేయాలన్నారు. ఎటువంటి సమస్యలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు పై అధికారుల స లహాలు సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు వారధిలా పని చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, పశుసంవర్ధక శాఖ జెడి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking