తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిజమైనపారదర్శక ప్రజాపాలన వచ్చింది

పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 5 (ప్రజాబలం) ఖమ్మం అక్రమాలకు, బంధుప్రీతికి, పైరవీలకు ఆస్కారం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పక్షపాతం లేకుండా నిజమైన పారదర్శక ప్రభుత్వం వచ్చిందని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారoటీ ల పథకం అమలు జరగటంతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, పొంగులేటి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హర్షం ప్రకటించారు
పండితాపురంలో ప్రజా పాలన గ్రామసభను ,ఎండిఓ, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్, ఎస్సై,, విద్యుత్తు, హెల్త్, అంగన్ వాడి అధికారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, నెరవేర్చలేక పోయిందని బందు ప్రీతితో, పైరవీలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను, అప్పుల తెలంగాణగా మార్చిందని, ఈ విషయాన్ని కప్పి పెట్టి, తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని, దేశానికి తెలంగాణ మోడల్ అని అబద్ధాలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజల కోరికలు నెరవేరుతాయని, ప్రజలంతా సమిష్టిగా ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ కట్టబెట్టారని, వంద రోజులలో అమలు చేస్తామన్న గ్యారెంటీల పథకం అమలులో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దీనిపై ప్రజలంతా ఒక జాతర లాగా దరఖాస్తులు పెట్టుకోవడం,భారీగా స్పందించడం చాలా సంతోషంగా ఉందని, అధిక మెజారిటీ సాధించిన కోరం కనకయ్య గారి హయాంలో, గృహ నిర్మాణ శాఖ మాత్యులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల, గిరిజనులు అధికంగా ఉన్న కామేపల్లి మండలానికి ఎక్కువ నిధులు సమకూర్చి అభివృద్ధి చేసుకుందామని, ఈరోజు తోనే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking