వికలాంగుల ధృవీకరణ పత్రముల సేకరణకు తేదీలు ఖరారు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ జిల్లా. తేది: 04.01.2024.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యం లో మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వికలాంగులను గుర్తించి అర్హత గల వారికీ సదరం ధృవీకరణ పత్రము పొందుటకు గాను జనవరి – 2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ ఈ సేవ కేంద్రాలకు కేటాయించడము జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు

సదరం క్యాంప్ కు హాజరు కాగోరు దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ఈ సేవ కేంద్రము నందు ఆన్ లైన్ లో స్లాటు బుక్ చేసుకొని , రసీదులో కేటాయింపడిన రోజున ఉదయం 9:00 గం,, నుండి మధ్యాహ్నం 12:00 గం. వరకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు . ఆన్ లైన్ లో నమోదు కాని వారు సదరం క్యాంప్ కు హాజరు కావాల్సిన అవసరం లేదు అని అయన పేర్కొన్నారు .

సదరం క్యాంపు తేదీలు ఈ క్రింది విధము గా ఏర్పాటుచేయడంజరిగిందని తెలిపారు.

1) 09.01.2024 – మంగళవారము HEARING IMPAIRMENT (వినికిడి లోపం), VISION IMPAIRMENT (దృష్టి లోపం), Mental retardation (మానసిక మాంద్యము), 2) 10.01.2024 – బుధవారము – శారీరక వికలాంగులు Orthopaedically Handicapped (ఆర్తోపెడికల్ వికలాంగుడు), 3) 18.01.2024 – గురువారము – మూగ & వినికిడి లోపం, HEARING IMPAIRMENT, VISION IMPAIRMENT (దృష్టి లోపం), Mental retardation (మానసిక మాంద్యము), 4) 18.01.2024 – గురువారము – మూగ & వినికిడి లోపం, HEARING IMPAIRMENT (వినికిడి లోపం), – VISION IMPAIRMENT (దృష్టి లోపం), Mental retardation (మానసిక మాంద్యము, 19.01.2024 – శుక్రవారము – Orthopaedically Handicapped (ఆర్తోపెడికల్ వికలాంగుడు), 23.01.2024 – మంగళవారము – VISION IMPAIRMENT- (దృష్టి లోపం) , HEARING IMPAIRMENT (వినికిడి లోపం), Mental retardation (మానసిక మాంద్యము), . 24.01.2024 – బుధవారము – Orthopaedically Handicapped (ఆర్తోపెడికల్ వికలాంగుడు), వీరికి తేదీలు కేటాయించడం జరిగిందని తెలిపారు .
సదరం క్యాంపుకు వచ్చేవారు , మీ సేవ రశీదు, 2) ఫోటో, 3) ఆదార్ జిరాక్స్ మరియు 4) సంబందిత మెడికల్ రిపోర్ట్స్ వెంట తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చందూనాయక్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking