కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లతో దేశానికే ఆదర్శంగా నిలిచాం ఎమ్మెల్యే దివాకర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ లు తెలంగాణలో ప్రవేశపెట్టి దేశానికే తమ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలో స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్ధిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏడాదికి సుమారు రూ.9 కోట్ల చొప్పున లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందజేస్తుందని ఆయన వివరించారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.18 కోట్లు బాధితులకు అందజేసి అండగా నిలిచామన్నారు.కేసీఆర్ హాయంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు అండగా నిలువాలని కోరారు. అనంతరం 41 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ అన్నం మంగ, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, కో-ఆప్షన్ షాహిద్ అలీ, డీ టీ సనత్,ఆర్ ఐ సంజీవ్,బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,నాయకులు అంకతి గంగాధర్,మెట్టు రాజు,బాకం లచ్చన్న,కొత్తూరు సర్పంచ్ సొల్లు సురేష్, శంకరయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking