జూలై 3 నుండి ప్రగతి సుధామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉతృష్ట సోమయాగం…

 

హైదరాబాద్ : ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూర్వీకుల కాలం నుండి చేస్తున్న యాగమే శ్రీ మహాగ్ని చయన పూర్వక సర్వపృష్ట సర్వస్తోమ అప్తోర్యామ ఉతృష్ట సోమయాగమని ప్రగతి సుధామ ఫౌండేషన్ అధినేత జి వి కె రావు అన్నారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతి రిసార్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ మహాగ్ని చయన పూర్వక సర్వపృష్ట సర్వస్తోమ అప్తోర్యామ ఉతృష్ట సోమ యాగం జూలై 3 నుండి 13 వ తేదీ వరకు శంకర్ పల్లి మండలంలోని బయో డైవర్సిటీ వద్ద ప్రకృతి మాతా ఫౌండేషన్ లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.93 సంవత్సరాల తరువాత ఈ యాగం నిర్వహణ జరుగుతున్నట్లు,ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూర్వీకుల నుండి చేస్తున్న యాగాలే అని అన్నారు. ఈ సందర్బంగా యాగానికి సంభందించిన బ్రోచర్ ను విడుదల చేశారు.ఈ యాగం అనంత కృష్ణ వాజపేయ యాజి యాజమాన్యంలోజరుగుతుందని,
ధర్మాలన్నిటికీ వేదం మూలమని,మట్టి ముంత తో,ఆవు నెయ్యి తో ఈ యాగం నిర్వహించబడుతుందని సోమయాగంలో భాగంగానే నిర్వహించే ఈ అప్తోర్యామ యాగం వల్ల గాలి, నీరు శుద్ధి అవుతాయని, గరుడ పక్షి రూపం ఆధారంగా ఈ యాగాన్ని నిర్వహిస్తారన్నారు,వర్షం సుభిక్షంగా కురవడానికి, దేశం క్షామం నుండి బయట పడడానికి,నిత్య అగ్ని హోత్రం, లోక కళ్యాణం కోసం,పవిత్ర వనాలు ఉన్నచోటే దేవతలు ఉంటారని, నాడు రాజులు చేసే వారని, నేడు దేశంలో ప్రజలు పరస్పర ప్రేమ, స్నేహ భావం తో మెలగాలని ఈ యాగాన్ని చేయ సంకల్పించినట్లు ఆయన తెలిపారు.ఈ యాగానికి విద్యా గణేశానంద స్వామీ వారు హాజరువనున్నట్లు ఆయన తెలిపారు.ఈ యాగానికి ప్రజలందరు ఆహ్వానితులే అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అనంత కృష్ణ వాజాపేయ యాజి, డాక్టర్ శ్రీధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking