శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 8 పాథాలజీ 16 రేడియాలజీ డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగారెడ్డి జిల్లాలోని లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి నుంచి ఆన్ లైన్ పద్దతి ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు..
ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు అందించిన సేవలు అపూర్వమైనవని మంత్రి కొనియాడారు..
అనంతరం నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో (6) ఆరు కోట్ల తో నిర్మించిన డయాగ్నొస్టిక్ హబ్ భవనాన్ని జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ప్రారంభించారు.
ప్రజలకు మరింత విస్తృతంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
వైద్యరంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని, ప్రజల కు నాణ్యమైన సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, నర్సింగ్ కాలేజీలు, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, ప్రతి నియోజకవర్గ పరిధిలో డయాలసిస్ కేంద్రం, ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని, ప్రైవేట్ ఆస్పత్రులలో 10 వేలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలను సైతం ప్రభుత్వం ఉచితంగా అందించడం వల్ల పేదవారికి చాలా ఉపయోగపడుతుందని, డయాలసిస్ కోసం గతంలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, నేడు తెలంగాణ ప్రభుత్వం దాదాపు ప్రతి నియోజకవర్గ పరిధిలో అందుబాటులోకి తీసుకు వచ్చిందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సూపరెండెంట్ దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.