SC రిజర్వేషన్ అమలుతోనే రజకుల జీవితాల్లో వెలుగులు

 

…తెలంగాణ రాష్ట్ర రజక ఆర్గనైజేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్

ఉమ్మడి మెదక్ జిల్లా మార్చి:24 ప్రజ బలం బ్యురో:*
రజక,చాకలి, ధోభీ, మడివేలు కులం వారి బ్రతుకులు అభివృద్ధికి నోచుకోలేక చాలా బాధాకరంగా ఉంది.*, దేశంలోని 17 రాష్ట్రాల్లో 65%శాతం మంది రజకులు SC రిజర్వేషన్ పొందుతూ అన్ని అవకాశాలు దక్కించుకుంటూ మంచి ఫలితాలను, అభివృద్ధిని పొందుతున్నారని,తెలంగాణ రాష్ట్ర రజక ఆర్గనైజేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో మరియు గత నెల రోజుల క్రితం ఏవిధంగానైతే వాల్మీకి బోయ ,అయితా,కాయితా లంబాడి వారిని ST జాబితాలోకి చేర్చడానికి ఇప్పటికే ఉన్న ST వారికి రిజర్వేషన్ పరంగా ఎలాంటి నష్టం జరగకుండా ST లకు ప్రస్తుతం ఉన్న 6% రిజర్వేషన్ ను 10% శాతానికి పెంచి వారిని STలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఏ విధంగానైతే కేంద్రానికి మీరు ప్రతిపాదనలు పంపారో అదేవిధంగా రజక,చాకలి, ధోభీ కులం వారు చేసే పని అంటరానిదని ఈ ధోభీ కులం వారిని SC కులాల్లో చేర్చుతూ ఇప్పుడు ఉన్న SC వర్గాలకు ఏలాంటి నష్టం జరగకుండా ఉన్న 15 శాతాన్ని 18 శాతానికి పెంచి బీసీ A లో ప్రస్తుతం ఉన్న 7% నుండి 2%శాతాన్ని జనాభా దామాషా ప్రకారం తీసి SC రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ, రిజర్వేషన్ ల అమలు 50% మించకుండా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విఘాతం లేకుండా దానికి లోబడే, కేంద్ర సామాజిక న్యాయ మంత్రాలయం రూపొందించిన మోడలిటీస్ ప్రకారం సిఫార్సు చేయాలని 2018లో ప్రగతి భవన్ వేదికగా గౌరవ సీఎం కేసీఆర్ గారికి జాతీయ రజక సంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్ గారితో పాటు మన రజక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సవివరంగా సుస్పష్టంగా ప్రత్యేక వినతిపత్రాన్ని మరియు రజకులు ఎదుర్కొంటున్న 24 సమస్యల పరిష్కారం కోసం వేరుగా వినతి పత్రాన్ని జాతీయ రజక సంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్ గారితో పాటు మన రజక సంఘం వివరించారు, దానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ గారు SC విషయం ఇంత మంది లో కాకుండా ప్రత్యేకంగా రెండు రోజుల్లోనే పిలిచి మాట్లాడి పెండిగ్ కాకుండా ఎలా చేయాలో ఆలోచిస్తామని చెప్పారు.మిగతా 24 సమస్యలపై గంటన్నర పాటు సమయాన్ని వెచ్చించి సమీక్షించారు ఇదంతా మనరజక సంఘం కృషి మాత్రమే.కొందరు ప్రజాబలం లేని స్వయం ప్రకటిత అప్రజాస్వామిక బోగస్ సంఘ నాయకులు ఈ రిజర్వేషన్ భావజాలంకు అన్ని విధాలుగా,ఆటంకాలు ,విఘాతం,కల్గిస్తూ ముందుకు నడిచే నాయకుని కాళ్ళకు కట్టెలు పెడుతున్నారు.కొద్ది రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన నోటిఫికేషన్లు వాటి ద్వారా పరీక్షలు జరిగి రద్దు అయిన పరీక్షల్లో అలాగే 2014 నుండి ఇప్పటి వరకు BC-A లో ఉన్న మన రజక సోదరులు ఎంతమంది అర్హత సాధించారు, ఉద్యోగాలు పొందారు
ఇప్పటి వరకు BC-A లో మన రజక వారు ఎంత మంది లబ్ధి పొందారు వారి జాబితా చెప్పగలరా. కేవలం జిల్లాకు ఒకటో, రెండో టీచర్, కానిస్టేబుల్స్, జూనియర్ లైన్ మెన్ వంటి చిన్నా చితకా ప్రభుత్వోద్యోగాలు మాత్రమే పొందారు,గతంలో బీసీ ఏ లో 32 కుల నుండి నేడు 68 సంఖ్యకు పెరిగి అదే 7% శాతం రిజర్వేషన్లతో మనం ఏమి సాధిస్తామని, ఇప్పటికే సాతాను, శ్రీ వైష్ణవులు బీసీ డి కులం వారు బీసీ ఏ లోని దాసరి వారీగా, అలాగే వాల్మీకి బోయ ఎల్లాపి,ఎల్లాపుల పేరుతో అగ్రకుల వెలమ, మున్నూరు కాపు వారు బీసీ ఏ లో చేరడానికి రంగం సిద్ధమైంది, బీసీ డి జాబితాలో ఉన్న ముదిరాజ్ వర్గం వారు కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఉన్న BC-A జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.మనం జాతికి ఏదైనా చేయాలనే రోషం పౌరుషం,పట్టు, నిస్వార్థంగా ఉంటే ప్రజా బలం చూపి సాధించి రజక జాతికి దైవంగా నిలబడదాం లేదా మనం జీవితాంతం రజక ద్రోహులుగా ముద్రపడి అందరి భవిష్యత్తు నాశనం చేసిన వారీగా మిగిలి పోతాం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్,అశోక్,రాజేష్, నర్సింలు, శ్రీనివాస్,రాష్ట్ర సభ్యులు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking