2.65 కోట్లతో ఆదర్శంగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ భవనం.. ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే…

 

(కుత్బుల్లాపూర్, ప్రజాబలం న్యూస్)
మార్చి : 24

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో అరబిందో ఫార్మా సౌజన్యంతో రూ.2.65 కోట్లతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే మోడల్‌గా రూపుదిద్దుకున్న బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ భవనంను శుక్రవారం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని.. ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మధన్ మోహన్ రెడ్డి, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, స్థానిక ఎస్.హెచ్.ఓ నర్సింహా రెడ్డి, కమిషనర్ రామ కృష్ణరావు, కార్పొరేటర్ కాసాని సుధాకర్ తో కలిసి ప్రారంభించారు. సుమారు 2 ఎకరాల సువిశాలమైన స్థలంలో 21 వేల చదరపు అడుగుల్లో రెండు అంతస్తుల్లో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ప్రారంభించుకోవడం పట్ల సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించారన్నారు. గడిచిన ఏళ్ళల్లో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీసింగ్ తో సహా పోలీసు శాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు ప్రాధాన్యతను కల్పించారని, గడిచిన ఏళ్లలో తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా కేసులను  చేదించగలుగుతున్నారని చెప్పారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking