పంట న‌ష్టపోయిన రైతుకు ఎక‌రాకు రూ. 10 వేలు స‌హ‌యం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 

 

బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో ఎక్క‌డైనా 10 వేలు ఇస్తున్నారా

రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌

సీయం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఎమ్మెల్సీ క‌విత‌ను టార్గెట్ చేశారు

విచార‌ణ పేరుతో గంట‌ల కొద్ది విచారిస్తూ క‌క్ష్య‌సాధింపుల‌కు పాల్ప‌డుతున్నారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్, మార్చి 24: పంట న‌ష్టపోయిన రైతుకు ఎక‌రాకు రూ. 10 వేలు స‌హ‌యం చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ‌యే న‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.పంట న‌ష్ట పోయిన రైతుల‌కు ఎక‌రాకు రూ.10 వేల స‌హ‌యం చేస్తామ‌ని ప్ర‌క‌టించి సీయం కేసీఆర్ రైతుల‌కు అండ‌గా నిలిస్తే.దీన్ని కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని తెలిపారు. బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో రైతుల‌కు ఎక్క‌డైనా 10 వేలు పంట న‌ష్టం కింద ఇస్తున్నారా అని ప్ర‌శ్నించారు.అదే విధంగా నిరంత‌రం నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌ను నిరంత‌రం పెంచుతూ.పేద ప్ర‌జ‌ల‌పై కేంద్రం ఆర్థిక బారం మోపుతుంద‌ని ఆవేద‌న వక్తం చేశారు.
మ‌రోవైపు సీయం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఆయ‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత‌ను బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం టార్గెట్ గా చేసింద‌న్నారు. విచార‌ణ పేరుతో గంట‌ల కొద్ది విచారిస్తూ క‌క్ష్య‌సాధింపుల‌కు పాల్ప‌డుతుంద‌న్నారు.
దిలావ‌ర్ పూర్ మండ‌ల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ నీళ్లు,నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేశార‌ని,సీయం కేసీఆర్ నేతృత్వంలో ప్ర‌జ‌ల అకాంక్ష‌లు నెర‌వేర‌య‌న్నారు. ఉమ్మ‌డి పాల‌న‌లో రైతులు అరిగోస ప‌డ్డారని, స్వ‌రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌తో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నార‌ని తెలిపారు.ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడ మే కాకుండాప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలన్నా రు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు.
దేశంలోనే తెలంగాణ పధకాలను ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రతి పక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల‌ని పిలుపినిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking