గంజాయితో పట్టుబడిన మహిళ

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 31

జమ్మికుంట పట్టణం లోని రైల్వే స్టేషన్, కొత్తపల్లి ఏరియా లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించగా జమ్మికుంట పట్టణానికి చెందిన ఎండి షమీం అనే మహిళ వద్ద 490 గ్రాముల గంజాయి పట్టుబడింది. సదరు మహిళలు ఎక్సైజ్ వారు వివరాలు అడగగా నేను జమ్మికుంటలో ఎవరికి అమ్మడం లేదు మహారాష్ట్రలోని బల్లార్షా కు చేరవేయుటకు గాను నాకు కూలి డబ్బులు వస్తాయి అని సమాధానం చెప్పింది. ఇట్టి మహిళను అదుపులో తీసుకొని జమ్మికుంట తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి గంజాయిని స్వాధీనం చేసుకొని ఎండి షమీంపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్సై ఎం సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య, పెద్దన్న భాస్కర్, మహేష్, పద్మావతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking