పురుల మందు తాగి మహిళా మృతి.

 

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21

పురుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే శ్రీరాముల సరోజన భర్త రాజయ్య (58) మహిళ మంగళవారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జమ్మికుంట లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రోజున రాత్రి 11.30 నిమిషాలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుందని భర్త శ్రీరాముల రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లందకుంట ఎస్సై ఎన్. రాజకుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking